సల్మాన్ ఖాన్.. తన పినతల్లి.. పుట్టినరోజును ధూం ధాంగా జరుపుతున్నారు. అలనాటి అందాల తార.. బాలీవుడ్ డ్యాన్స్ క్వీన్.. హెలెన్ పుట్టినరోజు వేడుకలను.. ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్ లో చాలా గ్రాండ్ గా జరిపేందుకు సల్లూ భాయ్ చొరవచూపారు. సల్మాన్ ఖాన్ తండ్రి..సలీమ్ ఖాన్ కు రెండవ భార్య అయిన హెలెన్.. 78వ సంవత్సరంలో అడుగుపెడుతుండగా.. సల్మాన్ ఈ పార్టీని ఏర్పాటుచేశారు. ఖాన్ కు సన్నిహితులైన ప్రముఖులకు మాత్రమే ఈ పార్టీకి హాజరుకానున్నారు.