ఘనంగా దత్తాత్రేయ కుమార్తె వివాహం, హాజరైన ప్రముఖులు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి, జిగ్నేశ్‌ల వివాహం ఇవాళ ఉదయం ఘనంగా జరిగింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని మినీ స్టేడియంలో జరిగిన ఈ వివాహానికి రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, సినీనటుడు చిరంజీవి, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, శాసనమండలిలో విపక్షనేత షబ్బీర్‌అలీతో పాటు పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.